కోటిన్నర విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-31T08:43:29+05:30 IST

కోటిన్నర విలువైన గుట్కా స్వాధీనం

కోటిన్నర విలువైన గుట్కా స్వాధీనం

సబ్బవరం, డిసెంబరు 30: బియ్యం లారీలో తరలిస్తున్న రూ.1.5 కోట్ల విలువైన గుట్కాను విశాఖపట్నం జిల్లా సబ్బవరం పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జోడుగుళ్లు జంక్షన్‌ వద్ద నిలిపి ఉంచిన బియ్యం లారీలో గుట్కా తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో రూ.1.5 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదుచేసినట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. లారీని సీజ్‌ చేసి డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-12-31T08:43:29+05:30 IST