బెజవాడలో గుట్కా, గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-18T08:28:09+05:30 IST

విజయవాడలో భారీ ఎత్తున నిల్వ చేసిన గుట్కా, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికారెడ్డి, సాయిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ట్రేడింగ్‌ ముసుగులో గుట్కాను విక్రయిస్తున్నారు

బెజవాడలో గుట్కా, గంజాయి స్వాధీనం

విజయవాడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో భారీ ఎత్తున నిల్వ చేసిన గుట్కా, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికారెడ్డి, సాయిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ట్రేడింగ్‌ ముసుగులో గుట్కాను విక్రయిస్తున్నారు. దీంతోపాటు గంజాయిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్రలోని పుణె, కర్ణాటక, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి గుట్కాను దిగుమతి చేసుకుని... వన్‌ టౌన్‌ ఐరన్‌ బజార్‌లో అద్దెకు తీసుకున్న గదుల్లో భద్రపరుస్తున్నారు. కొద్దిరోజులుగా పోలీసులు గుట్కా వ్యాపారులపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రికారెడ్డి, సాయిరెడ్డి పరారయ్యారు. బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఈ గదుల తాళాలను పగలగొట్టి సోదాలు నిర్వహించారు. అందులో రూ.86లక్షల విలువ గుట్కా సరుకు ఉన్నట్టు గుర్తించారు. అంతేగాకుండా గంజాయి, రూ.5 లక్షల నగదు కూడా బయటపడింది. 

Updated Date - 2021-06-18T08:28:09+05:30 IST