జీజీహెచ్‌లో నిలిచిపోయిన వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-12-08T20:47:03+05:30 IST

గుంటూరు: జీజీహెచ్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి.

జీజీహెచ్‌లో నిలిచిపోయిన వైద్య సేవలు

గుంటూరు: జీజీహెచ్‌లో వైద్య సేవలు  నిలిచిపోయాయి. మంగళవారం నుంచి విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూడాల సమ్మెపై అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.


బుధవారం ఉదయం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి జీజీహెచ్ ఎదుట బైఠాయించిన నిరసన చేపట్టారు. రోగి బంధువులు ఓ జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారంటూ నిన్నటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. సీఎం బంధువులమని వైద్యులపై కొందరు యువకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-08T20:47:03+05:30 IST