దుర్మార్గులు ఎలా ఉంటారో వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తోంది: శ్రీనివాస్ యాదవ్

ABN , First Publish Date - 2021-11-21T19:42:27+05:30 IST

దుర్మార్గులు ఎలా ఉంటారో వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తోందని జనసేన నేత అన్నారు.

దుర్మార్గులు ఎలా ఉంటారో వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తోంది: శ్రీనివాస్ యాదవ్

గుంటూరు: దుర్మార్గులు ఎలా ఉంటారో వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తోందని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలు వదిలి వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఓ వైపు వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకునే నాధుడే లేడన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు లేవని, ముందస్తు జాగ్రత్తలు లేవని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశంలో చక్కర్లు కొట్టడం కాకుండా, తక్షణమే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-21T19:42:27+05:30 IST