Guntur: బర్త్ డే పార్టీ పేరుతో యువకుల హల్‌చల్

ABN , First Publish Date - 2021-08-10T14:03:52+05:30 IST

శ్రీనగర్ కాలనీలో బర్త్ డే పార్టీ పేరుతో యువకుల హల్‌చల్ చేశారు. అర్థరాత్రి బైక్ ర్యాలీ చేసి.. బాణాసంచా పేల్చి నానా హంగామా సృష్టించారు యువకులు. నడిరోడ్డుపై అర్థరాత్రి పార్టీ చేసుకున్న

Guntur: బర్త్ డే పార్టీ పేరుతో యువకుల హల్‌చల్

గుంటూరు: శ్రీనగర్ కాలనీలో బర్త్ డే పార్టీ పేరుతో యువకుల హల్‌చల్ చేశారు. అర్థరాత్రి బైక్ ర్యాలీ చేసి.. బాణాసంచా పేల్చి నానా హంగామా సృష్టించారు యువకులు. నడిరోడ్డుపై అర్థరాత్రి పార్టీ చేసుకున్న తర్వాత బైక్‎లపై తిరుగుతూ కేకలు వేస్తూ.. బైక్ రైడింగ్‎లు చేశారు. చుట్టు ప్రక్కల ఉన్నవారు అల్లరి భరించలేక వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బర్త్ డే పార్టీ పేరుతో అల్లరి చేసిన 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా బర్త్ డే పార్టీల పేరుతో అర్థరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని వెస్ట్ డీఎస్పీ సుప్రజ వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - 2021-08-10T14:03:52+05:30 IST