జిన్నా టవర్ పేరు మార్చాలనడం విడ్డూరం: మస్తాన్ వలి

ABN , First Publish Date - 2021-12-31T00:48:07+05:30 IST

బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ నేత మస్తాన్ వలి ఓ ప్రకటనలో అన్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని ....

జిన్నా టవర్ పేరు మార్చాలనడం విడ్డూరం: మస్తాన్ వలి

గుంటూరు: బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ నేత మస్తాన్ వలి  ఓ ప్రకటనలో అన్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ నేత సత్యకుమార్ చెప్పటం విడ్డూరమన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన కట్టడం అది, స్వాతంత్య్ర సమరయోధులు అంతా అప్పుడు టవర్ ఏర్పాటుకు మద్దతిచ్చారని చరిత్ర చెబుతోందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు సున్నితమైన అంశాలు తెచ్చి ప్రజల మధ్య విద్వేషం పెంచుతున్నారని మస్తాన్ వలి మండిపడ్డారు. 


Updated Date - 2021-12-31T00:48:07+05:30 IST