గుంటూరు: దారుణ ఘటనపై నాలుగు ప్రత్యేక బృందాల దర్యాప్తు...

ABN , First Publish Date - 2021-06-21T16:16:12+05:30 IST

సామూహిక అత్యాచారం కేసులో నాలుగు పోలీస్ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.

గుంటూరు: దారుణ ఘటనపై నాలుగు ప్రత్యేక బృందాల దర్యాప్తు...

గుంటూరు: సామూహిక అత్యాచారం కేసులో నాలుగు పోలీస్ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు... టవర్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సైకో లక్షణాలు ఉన్న నిందితులే  దారుణానికి పాల్పడినట్లు  పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించిన పోలీసులు పాత నేరస్థుల వేలి ముద్రలతో పోల్చి చూస్తున్నారు. కాగా ఈరోజు నిందితులను గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


ప్రియుడ్ని కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగింది. విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రేమ జంట శనివారం రాత్రి 9 గంటల సమయంలో సీతానగరం పుష్కరఘాట్ల వద్దకు వచ్చింది. నదీ తీరంలోని మెట్ల మీద కొద్దిసేపు గడిపిన తరువాత రైలు వంతెన సమీపంలో ఇసుక తిన్నెలపై నడుస్తూ వెళ్తున్నారు. వీరిని గుర్తించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ప్రేమజంటను బెదిరించారు. ప్రియుడిని తాళ్లతో కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నది ఒడ్డున మత్స్యకారులకు చెందిన పడవలో అవతలి వైపు వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత తేరుకున్న బాధితులు అర్ధరాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.


Updated Date - 2021-06-21T16:16:12+05:30 IST