గుంటూరు జిల్లా: ఆత్మకూరులో ఇళ్లు కూల్చివేత

ABN , First Publish Date - 2021-03-22T16:02:07+05:30 IST

మంగళగిరి మండలం, ఆత్మకూరు రోడ్డు వెంట ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.

గుంటూరు జిల్లా: ఆత్మకూరులో ఇళ్లు కూల్చివేత

గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం, ఆత్మకూరు రోడ్డు వెంట ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. అక్కడ పేదలు గత 40 ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బలగాలతో బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే నివాసితులు కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆ పిటిషన్ కోర్టు ముందుకు రానుంది. అయితే అధికారులు ముందుగానే బలవంతంగా ఇళ్లు ఖాళీ  చేయిస్తున్నారు. దీంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-03-22T16:02:07+05:30 IST