క్విట్‌ మోదీ ఉద్యమం చేయాలి

ABN , First Publish Date - 2021-08-10T09:05:53+05:30 IST

నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేడు క్విట్‌ మోదీ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందని సీపీఐ జాతీ య కార్యదర్శి కె.నారాయణ తెలిపారు...

క్విట్‌ మోదీ ఉద్యమం చేయాలి

  • గుజరాత్‌ గ్యాంగ్‌ దేశాన్ని దోచుకుంటోంది: నారాయణ

విజయవాడ సిటీ, ఆగస్టు 9: నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేడు క్విట్‌ మోదీ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందని సీపీఐ జాతీ య కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. గుజరాత్‌ గ్యాంగ్‌ దేశాన్ని దోపిడీ చేస్తోందన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో.. సేవ్‌ ఇండియా, సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌, సేవ్‌ అగ్రికల్చర్‌ నినాదంతో దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏఐటీయూసీ, ఏఐకేఎస్‌, బీకేఎంయూ, ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ, ప్రజాసంఘాలు సోమవారం గాంధీనగర్‌లో మానవహారం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని 13 జిల్లాకు విస్తరిస్తామని, క్విట్‌ మోదీ నినాదాన్ని బలంగా వినిపిస్తామని అన్నారు. 


Updated Date - 2021-08-10T09:05:53+05:30 IST