నిరుద్యోగులకు హామీలు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2021-12-30T08:52:13+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి జనరల్ కేటగిరి వారికి 47 సంవత్సరాలకు పెంచి, తద్వారా మిగతా కేటగిరీలకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు.

సీఎంకు ఏపీ నిరుద్యోగ జేఏసీ బహిరంగ లేఖ
విజయవాడ, డిసెంబరు 29: ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి జనరల్ కేటగిరి వారికి 47 సంవత్సరాలకు పెంచి, తద్వారా మిగతా కేటగిరీలకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతీ ఏటా జనవరి 1వ తేదీన భారీ నోటిఫికేషన్లు, ఉద్యోగ కేలండర్లు ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల్లో గల ఖాళీల ప్రకారం 32 వేల ఉద్యోగాలను నింపి నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు.