తిరుమలలో పెరుగుతున్న రద్దీ

ABN , First Publish Date - 2021-05-30T08:47:17+05:30 IST

తిరుమలలో దాదాపు 25 రోజుల తర్వాత భక్తుల రద్దీ పెరుగుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు మరణాల రేటు అధికంగా ఉన్న క్రమంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మే మొదటి వారం నుంచి

తిరుమలలో పెరుగుతున్న రద్దీ

తిరుమల, మే 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో దాదాపు 25 రోజుల తర్వాత భక్తుల రద్దీ పెరుగుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు మరణాల రేటు అధికంగా ఉన్న క్రమంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మే మొదటి వారం నుంచి క్రమంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే గత మూ డు రోజుల నుంచి స్వామిని దర్శించుకునే భక్తులు పెరిగారు. 26న 8,954మంది, 27న 10,601మంది, 28వ తేదీన 11,055 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.


తిరుమలలో రేపు అఖండ సుందరకాండ పారాయణం

మానవాళి ఆరోగ్యం కోసం తిరుమలలో సోమవారం ఽసుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శనివారం అఖండ పారాయణం ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్మూలనకు శ్రీవారి ఆశీస్సులు కోరుతూ  మే 31న అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-05-30T08:47:17+05:30 IST