మూలవిరాట్ గవర్నర్ దర్శనం దొరకలేదు: వర్లరామయ్య
ABN , First Publish Date - 2021-02-06T19:16:16+05:30 IST
మూలవిరాట్ గవర్నర్ దర్శనం దొరకలేదని టీడీపీ నేత వర్లరామయ్య విమర్శించారు. నాలుగోసారి గవర్నర్‌ను కలవలేకపోయామని చెప్పారు.

అమరావతి: మూలవిరాట్ గవర్నర్ దర్శనం దొరకలేదని టీడీపీ నేత వర్లరామయ్య విమర్శించారు. నాలుగోసారి గవర్నర్‌ను కలవలేకపోయామని చెప్పారు. పూజారి సెక్రటరీ దర్శనం కూడా దొరకలేదని వాపోయారు. ప్రధాన ప్రతిపక్షానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని తప్పుబట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని వర్లరామయ్య ధ్వజమెత్తారు. అంతకుముందు టీడీపీ నేతలు రాజ్ భవన్‌కు వెళ్లారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని టీడీపీ నేతలు కలిశారు. ఉద్యోగస్తులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే కాబినెట్ నుంచి తొలగించాలని ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు.