గనులు కేటాయిస్తే లాభాల బాటలో ‘ఉక్కు’

ABN , First Publish Date - 2021-03-14T09:27:17+05:30 IST

‘‘విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయిస్తే రెండేళ్లలో లాభాలబాట పట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రైవేటీకరణపై కేంద్రం

గనులు కేటాయిస్తే లాభాల బాటలో ‘ఉక్కు’

పోస్కోకు ‘విశాఖ’ వద్దు.. ‘కడప’ను అప్పగించండి: ఉదయభాను


న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయిస్తే రెండేళ్లలో లాభాలబాట పట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలి. ఉక్కును పోస్కో సంస్థకు అప్పగించవద్దు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కడప ఉక్కు పరిశ్రమను అప్పగించాలి’’ అని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను కోరారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. కడప ఉక్కు కంటే విశాఖ పరిశ్రమకే సీఎం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి, ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు. పరిశ్రమను కాపాడుకోడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి పలు సార్లు ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు వైసీపీతో కలిసి రావాలన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రకటనను బీజేపీ, జనసేన పార్టీలు ఖండించాలని సామినేని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-14T09:27:17+05:30 IST