మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: కన్నబాబు

ABN , First Publish Date - 2021-12-23T22:54:19+05:30 IST

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కన్నబాబు ప్రకటించారు. మిర్చికి సోకిన చీడ, పీడ నివారణ కోసం..

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: కన్నబాబు

అమరావతి: మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కన్నబాబు ప్రకటించారు. మిర్చికి సోకిన చీడ, పీడ నివారణ కోసం.. శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2021-22లో 5.11 లక్షల ఎకరాల్లో చిల్లీ సాగు జరిగిందని, నల్ల తామరపురుగు వల్ల మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిందని కన్నబాబు పేర్కొన్నారు. మిర్చి పంట నష్టం నివారణ చర్యలపై కమిటీ పని చేస్తుందని కన్నబాబు చెప్పారు.

Updated Date - 2021-12-23T22:54:19+05:30 IST