ఏపీని 4 జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-02-01T23:48:10+05:30 IST

ఏపీలో ఫైర్ సర్వీసెస్ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు జోన్లు స్థానంలో నాలుగు జోన్లు

ఏపీని 4 జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఏపీలో ఫైర్ సర్వీసెస్ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు జోన్లు స్థానంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేసింది. నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో మొదటి జోన్‌గా ఏర్పాటు చేసింది. రాజమండ్రి కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో రెండో జోన్‌గా, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ట్రైనింగ్ సెంటర్లలతో మూడో జోన్‌‌గా, కర్నూలు కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో నాలుగో జోన్‌గా ఏర్పాటు చేసింది.

Updated Date - 2021-02-01T23:48:10+05:30 IST