గోసంరక్షణలో ప్రభుత్వం విఫలం: శ్రీనివాసానంద

ABN , First Publish Date - 2021-12-19T09:19:44+05:30 IST

గోసంరక్షణలో ప్రభుత్వం విఫలం: శ్రీనివాసానంద

గోసంరక్షణలో ప్రభుత్వం విఫలం: శ్రీనివాసానంద

వెంకోజీపాలెం(విశాఖపట్నం), డిసెంబరు 18: గోసంరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృతికి కారణాలను తెలుసుకునేందుకు శనివారం సాయంత్రం ఆయన గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోసంరక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆ కారణంగానే ఇటీవల సింహాచలంలోనూ, ప్రస్తుతం ఇక్కడా గోవులు మృత్యువాతపడ్డాయన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జ్ఞానానంద ఆశ్రమంపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. 

Updated Date - 2021-12-19T09:19:44+05:30 IST