ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

ABN , First Publish Date - 2021-12-31T21:47:17+05:30 IST

ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త. న్యూ ఇయర్‌ సందర్బంగా శనివారం నుంచి మద్యం షాపుల్లోకి పాపులర్‌ బ్రాండ్‌లు అందుబాటులో

ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

అమరావతి: ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త. న్యూ ఇయర్‌ సందర్బంగా శనివారం నుంచి మద్యం షాపుల్లోకి పాపులర్‌ బ్రాండ్‌లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రాండ్‌ల కోసం బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఇప్పటికే డిపోలకు పాపులర్‌ బ్రాండ్ల సరుకు చేరింది. రేపటి నుంచి షాపుల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన ఆర్డర్ల మేరకు పాపులర్‌ కంపెనీలు సరఫరా చేయలేదు. బిల్లులు వస్తాయో రావోనన్న ఆందోళనతోనే పూర్తిస్ధాయిలో పాపులర్‌ బ్రాండ్‌లు సరఫరా చేయలేదని చెబుతున్నారు. న్యూ ఇయర్‌ సందర్బంగా ఇప్పటికే అర్ధరాత్రి వరకు బార్‌లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. రిటైల్‌ షాపుల్లో అమ్మకాలకు కూడా మరో గంట అదనంగా పొడగించారు. క్యూలైన్‌లలో ఉన్న చివరి వ్యక్తి వరకు మద్యం అమ్మాలని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2021-12-31T21:47:17+05:30 IST