Guntur: జీజీహెచ్‌లో నిలిచిన వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-12-08T19:24:09+05:30 IST

జీజీహెచ్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు.

Guntur: జీజీహెచ్‌లో నిలిచిన వైద్య సేవలు

గుంటూరు: జీజీహెచ్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. దీంతో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోగుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రోగి బంధువులు ఓ జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారంటూ నిన్నటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. సీఎం బంధువులమని వైద్యులపై కొందరు యువకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-08T19:24:09+05:30 IST