జగన్‌ను తరిమికొట్టాలి!
ABN , First Publish Date - 2021-02-06T09:37:05+05:30 IST
‘‘సీఎం జగన్‌ను తరిమికొట్టాలి. ప్రజాభయంతో పారిపోయేలా చేయాలి. దళితులెవరూ జగన్‌కు, ఆయన పార్టీకి ఓట్లు వేయొద్దు’’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో హర్షకుమార్ వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌ను తరిమికొట్టాలి. ప్రజాభయంతో పారిపోయేలా చేయాలి. దళితులెవరూ జగన్‌కు, ఆయన పార్టీకి ఓట్లు వేయొద్దు’’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి ‘ఫేస్‌బుక్ లైవ్’లో ఆయన సీఎం జగన్, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం అన్న మర్యాదను కూడా కోల్పోతున్నావు. సభ్యసమాజం తల దించుకునేట్టు చేస్తున్నావు. ఏపీని పాలించిన ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు’’ అని అన్నారు. శిరోముండడానికి గురైన ప్రసాద్ కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు నాటకమాడారని అన్నారు. 153ఏ సెక్షన్ కింద అతను రెండు సామాజిక వర్గాల మధ్య అల్లర్లు సృష్టించడానికి ఎత్తు వేశాడని పేర్కొం టూ అరెస్టు చేయడం దారుణమన్నారు. శిరోముండనం కేసులో రాష్ట్రపతి జోక్యం చేసుకుని విచారించమని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.