టీటీడీకి జీసీసీ పసుపు

ABN , First Publish Date - 2021-12-28T08:33:17+05:30 IST

తిరుమల-తిరుపతి దేవస్థానానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పసుపు సరఫరా చేయనుంది. తిరుపతి పర్యటనలో భాగంగా జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి అక్కడ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి సంస్థకు సహకరించాలని కోరగా, దానికి ఆయన సమ్మతించారు.

టీటీడీకి జీసీసీ పసుపు

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల-తిరుపతి దేవస్థానానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పసుపు సరఫరా చేయనుంది. తిరుపతి పర్యటనలో భాగంగా జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి అక్కడ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి సంస్థకు సహకరించాలని కోరగా, దానికి ఆయన సమ్మతించారు. టీటీడీ పూజలు, అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన పసుపును సరఫరా చేయాలని సూచించారు.  తొలి విడతగా రెండు వేల కిలోలు ముందుగా పంపాలని ఆర్డర్‌ ఇచ్చారు. ఏజెన్సీలో గిరిజనులు ఆర్గానిక్‌ విధానంలో పండించిన పసుపును మాత్రమే టీటీడీకి సరఫరా చేయనున్నామని, ఇంతకు ముందు తేనే కూడా అందించామని స్వాతిరాణి పేర్కొన్నారు. దీనివల్ల గిరిజనులకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వగలుగుతామని చెప్పారు.

Updated Date - 2021-12-28T08:33:17+05:30 IST