పశుదాణా చట్టం అమలుకు గెజిట్‌ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-09-02T09:28:56+05:30 IST

రాష్ట్రంలో పశుదాణా తయారీ, నాణ్యత నియంత్రణ, అమ్మకం, పంపిణీ చట్టం (ఏపీ యానిమల్‌ ఫీడ్‌ యాక్ట్‌-2020) సవరణ ఉత్తర్వులకు

పశుదాణా చట్టం అమలుకు గెజిట్‌ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో పశుదాణా తయారీ, నాణ్యత నియంత్రణ, అమ్మకం, పంపిణీ చట్టం (ఏపీ యానిమల్‌ ఫీడ్‌ యాక్ట్‌-2020) సవరణ ఉత్తర్వులకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో కంట్రోలింగ్‌ అథారిటీ ఉంటుంది. పశుదాణా నాణ్యత తనిఖీలకు పశువైద్యాధికారి చైర్మన్‌గా, రెవిన్యూ, పోలీసు అధికారులు సభ్యులుగా క్షేత్రస్థాయి కమిటీ ఉంటుంది. పశుదాణాలో నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

Updated Date - 2021-09-02T09:28:56+05:30 IST