దొంగే దొంగా అన్నట్లుగా టీడీపీ తీరు: గౌతమ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-02-02T00:20:22+05:30 IST

ఎవరెన్ని కుట్రలు చేసినా స్థానిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గెలిపిస్తారని పంచాయతీ ఎన్నికల వైసీపీ ఇన్‌‌చార్జి, ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

దొంగే దొంగా అన్నట్లుగా టీడీపీ తీరు: గౌతమ్‌రెడ్డి

కృష్ణా: ఏకగ్రీవాలపై దొంగే దొంగా అన్నట్లుగా టీడీపీ వ్యవహారం ఉందని ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ల గ్రామంలో గౌతమ్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు చేసినా స్థానిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గెలిపిస్తారన్నారు. గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో నూటికి 95 శాతం వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌ను టీడీపీ మాఫియా దుర్వినియోగం చేసేందుకు పథకాలు రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీడియో మార్ఫింగ్‌లు మొదలు పెట్టారని మండిపడ్డారు.


టీడీపీని ఎన్నికల్లో గెలిపించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏకగ్రీవాలపై , దొంగే 'దొంగ-దొంగా అన్నట్లుగా టీడీపీ వ్యవహారం ఉందన్నారు. చంద్రబాబు రిలీజ్ చేసిన పంచాయతీ మేనిఫెస్టో‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పూనుకున్నారని గౌతమ్‌రెడ్డి  చెప్పారు.

Updated Date - 2021-02-02T00:20:22+05:30 IST