పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-21T20:33:31+05:30 IST

పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభించారు. వరదలు వచ్చేనాటికి స్పిల్‌వే నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు

పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభం

ఏలూరు: పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభించారు. వరదలు వచ్చేనాటికి స్పిల్‌వే నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం 40 మీటర్ల ఎత్తుకు ఆరు గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. మొత్తం 48 గేట్లకు గానూ 42 గేట్లను అధికారులు అమర్చారు. 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల అమ‌రిక పూర్తైంది. ఇప్పటివరకు 17 ప‌వ‌ర్ ప్యాక్‌ల అమ‌రిక పూర్తైందని అధికారులు తెలిపారు. 42 గేట్లకు ప‌వ‌ర్‌ప్యాక్‌లు అమ‌ర్చి లిఫ్ట్‌మోడ్‌లో అధికారులు పెట్టనున్నారు. వ‌చ్చే వ‌ర‌ద నీటినంతా స్పిల్‌వే గుండా దిగువ‌కు విడుద‌ల చేయ‌డానికి అనువుగా గేట్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-05-21T20:33:31+05:30 IST