గరగపర్రులో మరోసారి దళితుల ఆందోళన
ABN , First Publish Date - 2021-11-26T19:26:49+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం గరగపర్రులో మరోసారి దళితుల ఆందోళన చోటు చేసుకుంది.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం గరగపర్రులో మరోసారి దళితుల ఆందోళన చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ర్యాలీ, రిలే నిరాహర దీక్షలు చేస్తున్నారు. పాత పంచాయతీ ఆఫీసును అంబేద్కర్ గ్రంథాలయంగా మార్చి.. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు గరగపర్రు బాధితులపై అక్రమ కేసులను పెట్టి వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. గరగపర్రు బాధితులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని దళితులు డిమాండ్ చేశారు.