అదానీ ఆధీనంలోకి గంగవరం పోర్ట్

ABN , First Publish Date - 2021-08-26T02:49:35+05:30 IST

అదానీ కంపెనీ ఆధీనంలోకి గంగవరం పోర్ట్ వెళ్లింది. గంగవరం పోర్ట్ అదానీ

అదానీ ఆధీనంలోకి గంగవరం పోర్ట్

విశాఖపట్నం: అదానీ కంపెనీ ఆధీనంలోకి గంగవరం పోర్ట్ వెళ్లింది. గంగవరం పోర్ట్ అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది. దీంతో గంగవరం పోర్ట్ 100 శాతం అదానీ పరమైంది.  పోర్ట్‌లో ఏపీ ప్రభుత్వ వాటా 10.4 శాతాన్ని అదానీ గ్రూప్‌కు అప్పగిస్తూ ఈ మేరకు ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ లేఖ రాసింది. 10.4 శాతం కింద 644 కోట్లను అదానీ గ్రూప్‌ చెల్లించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గంగవరం పోర్ట్ ఇక ఔట్‌ అయినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. 
Updated Date - 2021-08-26T02:49:35+05:30 IST