తెనాలిలో ఫంగస్ కేసుల కలకలం

ABN , First Publish Date - 2021-05-21T19:51:39+05:30 IST

గుంటూరు: తెనాలిలో ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రామలింగేశ్వరపేటకు చెందిన మరో మహిళకు ఫంగస్ లక్షణాలున్నట్టు గుర్తించారు.

తెనాలిలో ఫంగస్ కేసుల కలకలం

గుంటూరు: తెనాలిలో ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రామలింగేశ్వరపేటకు చెందిన మరో మహిళకు ఫంగస్ లక్షణాలున్నట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న ఓ మహిళకు ఫంగస్ సోకినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితురాలి భర్త, కుమారుడు వైట్ ఫంగస్‌ సోకినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి తెనాలి, గుంటూరు, మంగళగిరి ఆస్పత్రుల్లో చికిత్స లభించడం లేదు. తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌‌కి బాధితురాలిని కుటుంబ సభ్యులు తీసుకెళ్ళారు.

Updated Date - 2021-05-21T19:51:39+05:30 IST