ఎండ.. ఉక్కపోత

ABN , First Publish Date - 2021-08-10T10:02:31+05:30 IST

నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రం మీదుగా పడమర, నైరుతి గాలులు కొనసాగుతున్నాయి...

ఎండ.. ఉక్కపోత

  • బలహీనంగా నైరుతి రుతుపవనాలు


అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రం మీదుగా పడమర, నైరుతి గాలులు కొనసాగుతున్నాయి. సోమవారం రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యాయి. ఎండ, ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. నెల్లూరు, జంఘమహేశ్వరపురంలలో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఎండ తీవ్రతకు పలుచోట్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. వాతావరణ మార్పులతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.  

Updated Date - 2021-08-10T10:02:31+05:30 IST