వాక్‌ స్వాతంత్య్రం ఉందని జడ్జీలనూ తిట్టొచ్చా!: ద్వారంపూడి

ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST

‘‘వాక్‌ స్వాతంత్య్రం ఉందని ఎవరిని, ఎవరైనా తిట్టొచ్చా? జడ్జీలని, వారి ఇంట్లో వారిని, ఆడ బిడ్డల్ని

వాక్‌ స్వాతంత్య్రం ఉందని జడ్జీలనూ తిట్టొచ్చా!: ద్వారంపూడి

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 25: ‘‘వాక్‌ స్వాతంత్య్రం ఉందని ఎవరిని, ఎవరైనా తిట్టొచ్చా?  జడ్జీలని, వారి ఇంట్లో వారిని, ఆడ బిడ్డల్ని, తల్లులను, తండ్రులను తిడితే బెయిల్‌ ఇచ్చేస్తారా! పబ్లిక్‌గా సీఎం జగన్‌ను అనరాని మాటలు అన్న వ్యక్తికి భయం లేకుండా, జడ్జి వెంటనే బెయిల్‌ ఇచ్చారంటే... జడ్జీలనైనా తిట్టొచ్చు, తప్పులేదు అన్నట్లుంది’’ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పట్టాభి కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలని, సానుభూతి కోసం పట్టాభిని చంపేందుకు చంద్రబాబు రాజకీయ కుట్ర చేస్తున్నారని అన్నారు. పట్టాభికి ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలని ద్వారంపూడి అన్నారు.

Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST