రాజధాని లేని రాష్ట్రం ప్రపంచపటంలో ఏదైనా ఉందా?

ABN , First Publish Date - 2021-01-21T01:10:28+05:30 IST

ఏపీకి మూడు రాజధానులు వద్దు... అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 400 రోజులకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి ..

రాజధాని లేని రాష్ట్రం ప్రపంచపటంలో ఏదైనా ఉందా?

అమరావతి: ఏపీకి మూడు రాజధానులు వద్దు... అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 400 రోజులకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రైతులు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతూ రాజధాని ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా అమరావతి రైతులు వెనక్కి తగ్గలేదు. రాజధానిగా అమరావతినే ప్రకటించేవరకూ పోరాడతామని రైతులు అంటున్నారు. 


ఈ నేపథ్యంలో  ‘‘రాజధాని లేని రాష్ట్రం ప్రపంచపటంలో ఏదైనా ఉందా?. రాజధాని కోసం రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశామా?. రాజధాని కోసం మహిళలు కన్నీరు కార్చడం ఏనాడైనా జరిగిందా?. రాజధాని కోసం దళిత బహుజనులు ఉద్యమించడం చరిత్రలో ఉందా?. ఇన్ని రకాల పోరాటాలు ఏకంగా 400 రోజులు జరిగినా ప్రభుత్వానికి చలనం రాదా?. నేను విన్నాను- నేను ఉన్నాను అని చెప్పే జగన్‌కు అమరావతి నినాదాలు వినిపించవా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 







Updated Date - 2021-01-21T01:10:28+05:30 IST