ఉపాధిలో వెయ్యి కోట్లు దిగమింగారు: కూన

ABN , First Publish Date - 2021-11-02T08:36:36+05:30 IST

ఉపాధి హామీ పథకంలో వైసీపీ నేతలు రూ.1,000 కోట్లు దిగమింగారు. వారి అవినీతి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టింది.

ఉపాధిలో వెయ్యి కోట్లు దిగమింగారు: కూన

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో వైసీపీ నేతలు రూ.1,000 కోట్లు దిగమింగారు. వారి అవినీతి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టింది. దీనివల్లే వారికి రెండున్నర నెలల నుంచి వేతనాలు అందడం లేదు’’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సంవత్సరం ఉపాధి హామీ పనుల్లో రూ.1,000 కోట్లను వైసీపీ నేతలు స్వాహా చేశారు. మట్టి తోలినట్లు, చదును చేసినట్లు చూపించి వాటిని మింగేశారు. 684 కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టింది.’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2021-11-02T08:36:36+05:30 IST