అథవాలే వ్యాఖ్యల్లో గూడు పుఠానీ: వీహెచ్‌

ABN , First Publish Date - 2021-10-19T08:26:02+05:30 IST

విశాఖ స్టీల్స్‌ ప్రైవేటుపరం కాకుండా ఉండాలంటే.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్డీయేలో కలవాలంటూ కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు

అథవాలే వ్యాఖ్యల్లో గూడు పుఠానీ: వీహెచ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్స్‌ ప్రైవేటుపరం కాకుండా ఉండాలంటే.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్డీయేలో కలవాలంటూ కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు శోచనీయమని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. ఈ విషయంలో ఏదో గూడు పుఠానీ ఉందని, అథవాలే వ్యాఖ్యలపై జగన్‌ సమాధానమివ్వాలన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్స్‌ ప్రైవేటుపరమైతే రిజర్వేషన్లు పోతాయని, ఈ విషయంలో తాను పోరాటం చేస్తానని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. 

Updated Date - 2021-10-19T08:26:02+05:30 IST