మాజీ మిస్ తెలంగాణ మళ్లీ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-30T01:56:39+05:30 IST
మాజీ మిస్ తెలంగాణ హాసిని మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసింది. కృష్ణా

కృష్ణా: మాజీ మిస్ తెలంగాణ హాసిని మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి పైనుంచి మునేటిలోకి దూకి హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నందిగామలో బైక్ పైవచ్చి కాలువలోకి హాసిని దూకింది. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపి నీటిలోకి దూకింది. హాసినిని బ్రిడ్జి పైనుంచి దూకడం గమనించి స్థానికులు రక్షించారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను వీరులపాడు మండలం బోడవాడ గ్రామానికి చెందిన తనక భవాని అలియాస్ హాసినిగా పోలీసులు గుర్తించారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి ఇంటికి భవాని వచ్చింది. ఈమెను హైదరాబాద్‌లో హాసినిగా పిలుస్తారు . 2018లో ప్రవేటు సంస్థ నిర్వహించిన పోటీలలో మిస్ తెలంగాణాగా హాసిని ఎంపిక అయింది.
రెండు రోజుల క్రితం నారాయణగూడలోని తన అపార్ట్మెంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి హాసిని పాల్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆత్మహత్యాయత్నాన్ని హాసిని లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆ పోస్ట్‌ను చూసిన స్నేహితుడు 100 కాల్ చేసాడు. దీంతో పోలీసులు లైవ్ చూసి హాసినిని పోలీసులు కాపాడారు. అనంతరం అక్కడి నుంచి తన స్వగ్రామమైన వీరులపాడు మండలం బొదవాడకు తరలించారు. 2019లో మిస్ తెలంగాణ టైటిల్‌ను హాసిని గెలిచింది. ఇటీవల అత్యాచారం చేశారంటూ బంజారాహిల్స్ పీఎస్‌లో హాసిని ఫిర్యాదు చేసింది. తిరిగి ఈ రోజు కీసర బ్రిడ్జి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో తెలియని బంధువులు అంటున్నారు.