జగన్‌ని చొక్కా పట్టుకుని నిలదీయాలి: జవహర్‌

ABN , First Publish Date - 2021-03-22T09:39:16+05:30 IST

నోటి దూల మంత్రి అనిల్‌ కుమార్‌కు ఆవేశం ఎక్కువ.. విషయం తక్కువ అని మాజీ మంత్రి జవహర్‌ ఎద్దేవా చేశారు. 31 కేసుల్లో ముద్దాయి జగన్‌రెడ్డి వెనుక డప్పు

జగన్‌ని చొక్కా పట్టుకుని నిలదీయాలి: జవహర్‌

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): నోటి దూల మంత్రి అనిల్‌ కుమార్‌కు ఆవేశం ఎక్కువ.. విషయం తక్కువ అని మాజీ మంత్రి జవహర్‌ ఎద్దేవా చేశారు. 31 కేసుల్లో ముద్దాయి జగన్‌రెడ్డి వెనుక డప్పు కొట్టుకుంటూ తిరిగే అనిల్‌కి కనీస అవగాహన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆదివారం ట్విటర్‌ వేదికగా విమర్శించారు. ‘‘31 కేసుల్లో స్టే ఇవ్వాలంటూ కోర్టుకు ఎందుకెళ్లాడో జగన్‌ని చొక్కా పట్టుకుని నిలదీయాలి. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా వైఎస్‌ కుటుంబం, చంద్రబాబు మీద కేసులు వేయడం వల్లనే కోర్టు కొట్టేసింది. జగన్‌రెడ్డి పనికిమాలిన వాడు కాబట్టే.. చంద్రబాబుకు స్టే వచ్చింది. వైసీపీ నేతలు ఎక్కువగా మాట్లాడటం వెనుక సీఎం కావాలనుకునే ఒక పెద్దారెడ్డి ప్రణాళిక ఉన్నట్లు వినికిడి..!’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-03-22T09:39:16+05:30 IST