విశాఖ ఉక్కుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి...లేకపోతే: గంటా

ABN , First Publish Date - 2021-02-05T16:52:58+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి...లేకపోతే: గంటా

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే... 100 రెట్లు ఉద్యమం, తీవ్రత చవి చూడాల్సి వస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఐదు కోట్ల ఆంధ్రులు, 20 కోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సమానం’’ అంటూ గంటా ట్వీట్ చేశారు. Updated Date - 2021-02-05T16:52:58+05:30 IST