ఈ నెల 5న తిరుపతికి చంద్రబాబు
ABN , First Publish Date - 2021-03-03T11:53:09+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తిరుపతికి వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన...
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తిరుపతికి వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన (శుక్రవారం) తిరిగి తిరుపతి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఆ రోజు తిరుపతి, చిత్తూరు నగరాలు రెండూ సందర్శించి సభల్లో ప్రసంగిస్తారు. చిత్తూరు పర్యటనకు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు సోమవారం తిరుపతి విమానాశ్రయంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదు జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. గురువారం కర్నూలు, ఐదో తేదీన తిరుపతి, 6న విశాఖపట్నం, 7న విజయవాడ, 8న గుంటూరులో ఆయన పర్యటిస్తారు.