గ్రంథాలయ ఉద్యోగులకు ‘010 పద్దు’ జీతాలు, పెన్షన్లు!
ABN , First Publish Date - 2021-01-20T08:42:27+05:30 IST
గ్రంథాలయ ఉద్యోగులు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 010 పద్దు ద్వారా జీతాలు, అలాగే పెన్షన్ల చెల్లింపునకు సీఎం జగన్ అంగీకరించారని ఏపీ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లెపల్లి

సీఎం అంగీకారంపై ఉద్యోగుల హర్షం
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయ ఉద్యోగులు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 010 పద్దు ద్వారా జీతాలు, అలాగే పెన్షన్ల చెల్లింపునకు సీఎం జగన్ అంగీకరించారని ఏపీ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లెపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర కన్వీనర్ కోన దేవదాసు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీజీఈఎఫ్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో తాము మంగళవారం సీఎంను కలిసి విన్నవించగా.. వెంటనే ఫైలు సిద్ధం చే యాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.