సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-10-30T02:05:29+05:30 IST
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతుండటంతో రెండు క్రస్ట్ గేట్లను 10అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు

నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతుండటంతో రెండు క్రస్ట్ గేట్లను 10అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 590 అడుగులు(312.0450టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి మొత్తం 82,114 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 62,324 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు(215.8070టీఎంసీలు) కాగా ప్రస్తుతం 874.90 అడుగులుగా(163.2008టీఎంసీలు) ఉంది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 18,580 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.