15.31 లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-21T18:59:31+05:30 IST

హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. గురువారం 1,653 బృందాలు 1,76,392 ఇళ్లలో సర్వే చేశాయని జీహెచ్‌ఎంసీ

15.31 లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే

హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. గురువారం 1,653 బృందాలు 1,76,392 ఇళ్లలో సర్వే చేశాయని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 15,31,507 ఇళ్లలో సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, జీహెచ్‌ఎంసీ వర్కర్‌లతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నాయి. జ్వరం ఉన్న వారిని గుర్తించి మందుల కిట్లు ఇవ్వడంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. బస్తీ దవాఖానా, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలోనూ కొవిడ్‌ ఓపీ సేవలు మొదలయ్యాయి. ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 2,68,674 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2021-05-21T18:59:31+05:30 IST