అమరావతి రైతుల మహాపాదయాత్రలో కీలక పరిణామం.. వాళ్లొచ్చారు..!

ABN , First Publish Date - 2021-11-21T16:12:54+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. వర్షపు జల్లులు పడుతున్నా లెక్క చేయకుండా పాదయాత్ర ముందుకు కొనసాగుతుంది. అయితే..రాజధాని రైతుల

అమరావతి రైతుల మహాపాదయాత్రలో కీలక పరిణామం.. వాళ్లొచ్చారు..!

అమరావతి : రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. శనివారం నాడు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో జోరుగా సాగింది. అయితే.. వర్షపు జల్లులు పడుతున్నా లెక్క చేయకుండా పాదయాత్ర బృందం ముందుకు నడిచింది. ప్రతి గ్రామం వద్ద ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. ఈ పాదయాత్రలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటి వరకూ ఈ పాదయాత్రకు.. ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు మద్దతు పలకబోతోంది. రాష్ట్ర ముఖ్యనేతలైన ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి.. పురంధేశ్వరీ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.


తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీకి చెందిన హేమాహేమీలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు.. పార్టీ బలోపేతం ముఖ్యంగా అమరావతి ఉద్యమం గురించి నిశితంగా చర్చించారు. అనంతరం రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఆదేశించినట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల గ్యాప్‌లోనే రాష్ట్ర నేతలంతా ఉద్యమంలో పాల్గొనడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే కొందరు నేతలు పాదయాత్రా స్థలికి చేరుకోగా.. రైతులు ఘన స్వాగతం పలికారు. కాగా.. ఇదే బీజేపీలో కొందరు ఏపీ నేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

Updated Date - 2021-11-21T16:12:54+05:30 IST