ఏపీ బడ్జెట్‌లో రైతన్నకు వరాలు
ABN , First Publish Date - 2021-05-20T18:11:28+05:30 IST
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతన్నకు వరాలు ప్రకటించారు. అన్నదాతకు అన్నీ తానై వారికి అడుగడుగునా అండగా ఉంటూ ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.