గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు :సీఎస్‌

ABN , First Publish Date - 2021-01-13T08:08:08+05:30 IST

రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 26న నిర్వహంచనున్న గణతంత్ర వేడుకల విజయవంతానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సంబంధిత శాఖల అధికారుల ను ఆదేశించారు.

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు :సీఎస్‌

అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 26న నిర్వహంచనున్న గణతంత్ర వేడుకల విజయవంతానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సంబంధిత శాఖల అధికారుల ను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలోని సీఎస్‌ క్యాం పు కార్యాలయంలో డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి సమీక్షించారు.  ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేసి ఆయా పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలని, శకటాల ఏర్పాట్లను సమాచారశాఖ పర్యవేక్షించాలన్నారు.  

Updated Date - 2021-01-13T08:08:08+05:30 IST