విద్యుత్ ఉద్యోగులకు డిప్యుటేషన్ పొడిగింపు
ABN , First Publish Date - 2021-03-05T09:18:35+05:30 IST
విద్యుత్ శాఖలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ట్రాన్స్‌కో నుంచి వచ్చి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగుల డిఫ్యుటేషన్‌ను మరో
విద్యుత్ శాఖలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ట్రాన్స్‌కో నుంచి వచ్చి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగుల డిఫ్యుటేషన్‌ను మరో ఏడాదిపాటు పొడిగించారు. అలాగే, విజయవాడ, కడప, విశాఖపట్నం జోన్లకు సంబంధించి.. నిర్మాణం, నిర్వహణ విభాగం సిబ్బంది ఇప్పటివరకూ విజయవాడలోని విద్యుత్ సంస్ధల కేంద్ర కార్యాలయం విద్యుత్ సౌధ నుంచి పనిచేస్తున్నారు. నిర్మాణ పనులను వేగంగా జరిపే నిమిత్తం ఆరుగురు ఇంజనీర్లను ఆ మూడు జోనల్ కేంద్రాలకు బదిలీ చేశారు.