గిరిజనులకు ఓటీఎస్‌ నుంచి మినహాయింపు

ABN , First Publish Date - 2021-12-25T08:35:02+05:30 IST

గిరిజనులకు ఓటీఎస్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు.

గిరిజనులకు ఓటీఎస్‌ నుంచి మినహాయింపు

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

పార్వతీపురం, డిసెంబరు 24: గిరిజనులకు ఓటీఎస్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పథకం ప్రారంభించిన సమయంలో గిరిజనులకు మినహాయింపు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. 

Updated Date - 2021-12-25T08:35:02+05:30 IST