కరోనా కష్టకాలంలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దాతృత్వం

ABN , First Publish Date - 2021-05-21T02:41:07+05:30 IST

కరోనా మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ...

కరోనా కష్టకాలంలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దాతృత్వం

కృష్ణా : కరోనా మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు తమ వంతు సాయం అందించాలని ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తమకు తోచినంతగా సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు కూడా సాయం దాతృత్వం చాటుకున్నారు. రాబోయే 3 సంవత్సరాల పెన్షన్ 10 లక్షల 80 వేల రూపాయిలను కరోనా బాధితుల కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేగా గతంలో పని చేసినందుకుగాను తనకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ రెండు రోజుల్లో స్పీకర్, కార్యదర్శులను కలిసి లేఖ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అందరూ మానవత్వంతో స్పందించాలని ఈ సందర్భంగా జ్యేష్ట తెలిపారు.

Updated Date - 2021-05-21T02:41:07+05:30 IST