అందరికీ న్యాయం అందాలి

ABN , First Publish Date - 2021-11-26T09:54:02+05:30 IST

అందరికీ న్యాయం అందాలి

అందరికీ న్యాయం అందాలి

జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

గుంటూరు(విద్య), నవంబరు 25 : సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యతను భావి న్యాయవాదులు విస్మరించరాదని హైకోర్టు జడ్జి జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు అన్నారు. నేషనల్‌ లాడే సందర్భంగా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ వర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఇన్‌చార్జి వీసీ కేవీ కృష్ణకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T09:54:02+05:30 IST