ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం: బత్తిన శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-11-05T21:57:41+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం: బత్తిన శ్రీనివాస్‌

విజయవాడ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టామని ప్రకటించారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇక్కడి అడ్రెస్‌ను రెండుసార్లు ఉపయోగించారని, రాకెట్ అంతా ఢిల్లీ కేంద్రంగా జరిగిందన్నారు. యాక్టివ్‌గా ఉన్న 18 మంది రౌడీ షీటర్లను బహిష్కరించామని, కొత్తగా 116 మందిపై రౌడీ షీట్స్ తెరిచామని, కౌన్సెలింగ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. 3 వేల మందిపై సస్పెక్ట్ షీట్స్ పెట్టామని, 1400 వాహనాలు సీజ్‌ చేసి 4 వేల మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నామని, 570 మందిపై చర్యలు తీసుకున్నామని బత్తిన శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-05T21:57:41+05:30 IST