రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తే దానికే బలవుతారు

ABN , First Publish Date - 2021-10-21T10:06:24+05:30 IST

గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని ప్రోత్సహించిన వారే దానికి బలవుతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఒక పార్టీ కార్యాలయంపై ఇటువంటి దాడి ఎప్పుడూ జరగలేదు.

రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తే దానికే బలవుతారు

పార్టీ కార్యాలయాలపై ఎన్నడూ  ఇలాంటి దాడి జరగలేదు: రామకృష్ణ

‘‘గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని ప్రోత్సహించిన వారే దానికి బలవుతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఒక పార్టీ కార్యాలయంపై ఇటువంటి దాడి ఎప్పుడూ జరగలేదు. ఈ దాడి ఒక్క మంగళగిరికే పరిమితం కాలేదు. విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, హిందూపురం, కాళహస్తి తదితర చోట్ల కూడా జరిగాయి. ఒక పథకం ప్రకారం జరిగాయనడానికి ఇదే నిదర్శనం’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ప్రతినిధి బృందం బుధవారం ఇక్కడ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి విధ్వంసాన్ని తిలకించింది.  

Updated Date - 2021-10-21T10:06:24+05:30 IST