విద్యుత్‌ మీటర్లకు శవయాత్ర!

ABN , First Publish Date - 2021-10-19T08:08:51+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా నెల్లూరు టీడీపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి

విద్యుత్‌ మీటర్లకు శవయాత్ర!

  • నెల్లూరులో టీడీపీ నేతల వినూత్న నిరసన


నెల్లూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా నెల్లూరు టీడీపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్‌ మీటర్లకు పాడికట్టి పొర్లుకట్ట నుంచి పెన్నా నది వరకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం మీటర్లను పెన్నా నదిలో జలసమాధి చేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T08:08:51+05:30 IST