విద్యావ్యవస్థలో మార్పులు: జగన్
ABN , First Publish Date - 2021-05-20T20:42:56+05:30 IST
విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని సీఎం జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే

అమరావతి: విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని సీఎం జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదు.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన తొలిరాష్ట్రం ఏపీ అని చెప్పారు. రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయంపై బతుకుతున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం అన్నారు. రైతులకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలపై నీలం- ఆకుపచ్చ రంగుల్ని.. కుట్రలు పన్ని తుడిచేశారు కానీ జనం గుండెల్లో తీసేయలేకపోయారని జగన్ పేర్కొన్నారు.