రూ.10 లక్షల Gutka స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-20T12:00:26+05:30 IST
జాతీయ రహదారిపై అన్నవరం నమూనాలయం సమీపంలో మంగళవారం అన్నవరం ఎస్‌ఐ రవికుమార్ రూ.10 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకుని నలుగురిని అరెస్టు

తూర్పు గోదావరి: జాతీయ రహదారిపై అన్నవరం నమూనాలయం సమీపంలో మంగళవారం అన్నవరం ఎస్‌ఐ రవికుమార్ రూ.10 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిషేధిత గుట్కాను ఒడిసా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి తాళ్లరేవుకు ఐషర్ వాహనంలో తరలిస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు డీఎస్పీ చెప్పారు. తనిఖీల సమయంలో వ్యాన్‌లో ఉన్న వ్యక్తులు పారిపోతుండడంతో పట్టుకుని 48 బస్తాల్లో 1,00,800 మీరజ్‌ఖైనీ, 10 బస్తాలలో 40 వేల ప్యాకెట్ల రాజాఖైనీ, 180 డీలక్స్ గుట్కా, 10 విస్కీ బాటిళ్లను గుర్తించామన్నారు. వ్యాన్‌లో ఉన్న కదా నానాజీరావు, నున్న వెంకట బుచ్చిరాజు, డ్రైవర్లు పితాని శివగణేష్, అయినవిల్లి సూరిబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు.